|
|
by Suryaa Desk | Wed, Dec 10, 2025, 07:06 PM
తెలంగాణ జిల్లాల్లో పంచాయతీ ఎన్నికల తొలి విడుత పోలింగ్ నేపథ్యంలో, భద్రతను కట్టుదిట్టం చేశారు. ఓటర్లను ప్రలోభాలకు గురికాకుండా పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు. ఎన్నికలు జరిగే పంచాయతీల్లోకి వెళ్లే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో సిరిసిల్ల నియోజకవర్గానికి వెళ్తున్న మాజీ మంత్రి కేటీఆర్ వాహనాన్ని జిల్లెల గ్రామం వద్ద పోలీసులు, ఎన్నికల సిబ్బంది ఆపి తనిఖీ చేశారు. తనిఖీల అనంతరం కేటీఆర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.