|
|
by Suryaa Desk | Wed, Dec 10, 2025, 10:37 AM
TG: 13 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన నలుగురిని సంగారెడ్డి పట్టణ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. వీరిలోఇద్దరు17 ఏళ్ల బాలురు కాగా.. మరో ఇద్దరికి 19 ఏళ్లు. ఈ నెల 4న సంగారెడ్డి నుంచి అదృశ్యమై బాలిక 8న సికింద్రాబాద్‌లో సంచరిస్తుండగా.. నలుగురు బాలురు ఆమెను పరిచయం చేసుకుని లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారం చేశారని పోలీసులు తెలిపారు. సెల్‌ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా బాలిక ఆచూకీని కనిపెట్టినట్లు చెప్పారు.