|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 08:47 PM
TG: భారత ఫ్యూచర్ సిటీలో 'తెలంగాణ రైజింగ్’ పేరిట రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్లోబల్ సమ్మిట్ సోమవారం అట్టహాసంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. తాజాగా ఈ సమ్మిట్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. విద్యుత్ శాఖలో భారీ ఒప్పందాలు కుదిరాయి. ఇవాళ ఒక్కరోజే రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం జరిగింది. పంప్ స్టోరేజీ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఎంవోయూ జరిగింది. ఈ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభ ప్లీనరీలో ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు పాల్గొన్నారు.