|
|
by Suryaa Desk | Tue, Dec 09, 2025, 08:43 PM
శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పరిధిలోని శ్రీ భీమేశ్వరాలయం నందు 14 రోజుల హుండీ ఆదాయం రూ. 1 కోటి 29 లక్షల 27 వేల 470 గా నమోదైంది. ఈ లెక్కింపులో మిశ్రమ బంగారం 60 గ్రాములు 500 మిల్లి గ్రాములు, మిశ్రమ వెండి 3 కిలోల 800 గ్రాములు లభించాయి. దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీమతి ఎల్. రమాదేవి, ఏసీ కార్యాలయ పరిశీలకులు శ్రీ రాజమౌళి, ఏఈఓలు, పర్యవేక్షకులు, ఆలయ అర్చకులు, సిబ్బంది, ఎస్పీఎఫ్, హోమ్ గార్డ్ సిబ్బంది, మరియు శ్రీ రాజరాజేశ్వర సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.