|
|
by Suryaa Desk | Tue, Dec 09, 2025, 01:58 PM
మెదక్ సమీకృత కలెక్టరేట్ ప్రాంగణంలో నెలకొల్పిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని జిల్లా రెవెన్యూ అధికారి భుజంగరావు మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కళాకారులు అందించిన ఆటపాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ ఉత్సవంలో ఏఎస్పీ మహేందర్, జిల్లా అధికారులు జోజి, విజయ, రామచంద్ర రాజు, వేణు, జగదీశ్, డా. శివాదయాల్, విజయలక్ష్మి, ఏఓ యూనస్, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.