|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 08:54 PM
భారీ సంఖ్యలో విమాన సర్వీసులు రద్దు కావడం ఇండిగోకు (IndiGo) 'క్రెడిట్ నెగెటివ్'గా మారిందని ప్రముఖ రేటింగ్స్ సంస్థ మూడీస్ నివేదించింది. కొత్త విమానయాన నిబంధనలపై సరైన ప్రణాళిక లేకపోవడమే దీనికి కారణమని, దీనివల్ల ఇండిగోకు గణనీయమైన ఆర్థిక నష్టం వాటిల్లుతుందని వివరించింది. DGCA జరిమానాలు విధించే అవకాశం ఉందని మూడీస్ అభిప్రాయపడింది. ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ (FTDL) నిబంధనలకు ఇండిగో సిద్ధం కాలేదని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లాభదాయకతపై ప్రతికూల ప్రభావం ఉంటుందని వివిరించింది.