|
|
by Suryaa Desk | Thu, Dec 11, 2025, 11:59 AM
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ సరళిని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కె. హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గజ్వేల్, ములుగు, మర్కుక్, జగదేవ్ పూర్, వర్గల్, రాయపోల్, దౌల్తాబాద్ మండలాల్లో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, మైక్రో అబ్సర్వర్లను నియమించారు. సుమారు మూడు వేల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉన్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చు, ఆ తర్వాత క్యూలో ఉన్న వారందరికీ అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. పోలింగ్ కేంద్రాల వద్ద మొబైల్ ఫోన్లకు అనుమతి లేదని, పటిష్ట బందోబస్తు నిర్వహించాలని పోలీసులను ఆదేశించారు.