|
|
by Suryaa Desk | Tue, Dec 09, 2025, 10:10 PM
గ్లోబల్ స్కిల్లింగ్ మరియు లెర్నింగ్ సేవలలో ప్రసిద్ధి గల అప్‌గ్రాడ్ (upGrad) హైదరాబాద్‌లో రెండు కొత్త లెర్నింగ్ సపోర్ట్ సెంటర్లను ప్రారంభించనుంది.ఈ కొత్త కేంద్రాల ద్వారా ‘ఫిజిటల్’ (ఫిజికల్ + డిజిటల్) లెర్నింగ్ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించనుందని కంపెనీ తెలిపింది. ఈ విస్తరణ, పెరుగుతున్న టెక్నాలజీ రంగ మరియు గ్లోబల్ కెపాసిటీ సెంటర్లలో నైపుణ్యాల డిమాండ్‌ను తీర్చడంలో ఉపయోగపడుతుందని వెల్లడించింది.అప్‌గ్రాడ్ ఇప్పటికే పుణే, కోల్‌కతా, ఇండోర్, భోపాల్, బెంగళూరు వంటి నగరాల్లో 11 ఆపరేషనల్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఇప్పుడు హైదరాబాద్ ఈ నెట్‌వర్క్‌లో కీలక కేంద్రంగా మారుతుంది. కంపెనీ ప్రకారం, మార్చి 2026 నాటికి ఈ నెట్‌వర్క్‌ను 40 కేంద్రాల వరకు విస్తరించడం లక్ష్యం. మెట్రో నగరాలు మరియు టైర్-2 నగరాల్లో అత్యుత్తమ హైబ్రిడ్ లెర్నింగ్ సేవలను అందించడం కూడా ప్రణాళికలో భాగం.ఏఐ, మిషన్ లెర్నింగ్, క్లౌడ్ టెక్నాలజీస్ మరియు డేటా సైన్స్‌లో నైపుణ్యాల పెరుగుతున్న డిమాండ్‌తో హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోందని అప్‌గ్రాడ్ తెలిపింది. ఈ నేపథ్యంలో కొత్త కేంద్రాలు నగరంలోని గ్రాడ్యుయేట్లకు నైపుణ్యాలను అందించడానికి ఉపయోగపడతాయి.అప్‌గ్రాడ్ సీఓఓ మనీష్ కల్రా మాట్లాడుతూ, "ప్రతి సంవత్సరం లక్షలాది గ్రాడ్యుయేట్లు శ్రామిక శక్తిలోకి చేరుతున్నప్పటికీ, యాజమాన్యాలు కోరుకునే నైపుణ్యాలు మరియు సాంప్రదాయ విద్యావ్యవస్థ అందించే నైపుణ్యాల మధ్య పెద్ద అంతరం ఉంది. మా కేంద్రాలు ఆ అంతరాన్ని భర్తీ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి" అని తెలిపారు.