|
|
by Suryaa Desk | Thu, Dec 11, 2025, 02:31 PM
హైకోర్టు ఆదేశాలను ధిక్కరించి, ఆర్టీఐ చట్టం ప్రకారం సమాచారం ఇవ్వలేదని వడ్డం శ్యామ్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఆర్టీఐ అప్పీలేటు అధికారులుగా ఉన్న మాజీ జీహెచ్ఎంసీ కమిషనర్ కె.ఇలంబర్తి, ప్రస్తుత కమిషనర్ ఆర్.వి కర్ణన్‌లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలున్నా సమాచారం ఇవ్వడానికి ఇబ్బంది ఏంటని న్యాయమూర్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఐఏఎస్‌లపై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని కోరింది.