|
|
by Suryaa Desk | Tue, Dec 09, 2025, 12:43 PM
అనుమానంతో ప్రియురాలిని దారుణంగా హత్య చేసిన ప్రియుడు. కత్తితో దారుణంగా హతమార్చి పోలీసులు వచ్చేంత వరకు రక్తపు మడుగులో వేచి చూసిన యువకుడు . నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని సంతోషిమాత ఆలయం సమీపంలో ఉన్న నందన టీ పాయింట్‌లో అశ్విని(27) అనే మహిళను దారుణంగా హతమార్చిన నగేష్ అనే వ్యక్తి. రెండేళ్ల క్రితం భర్తతో విడాకులు తీసుకుని, నగేష్‌తో ప్రేమలో పడి అతనితో కలిసి ఉంటున్న అశ్విని . ఈ క్రమంలో ఉపాధి కోసం అశ్వినికి టీ స్టాల్ పెట్టించిన నగేష్ . తరచూ టీ స్టాల్‌కు వస్తున్న మరొక యువకుడితో అశ్విని చనువుగా ఉండడం తట్టుకోలేక, గొడవకు దిగి, ఒక్కసారిగా కత్తితో అశ్వినిని దారుణంగా పొడిచి చంపిన నగేష్. రక్తపు మడుగులో పడి ఉన్న అశ్విని మృతదేహం వద్ద నగేష్‌ను చూసి, భయంతో పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు . ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు