|
|
by Suryaa Desk | Mon, Dec 15, 2025, 12:43 PM
నారా చంద్రబాబు నాయుడు ఈరోజు హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్‌లో ఉన్న ప్రఖ్యాత కన్హా శాంతి వనాన్ని సందర్శించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఆశ్రమ అధ్యక్షులు కమలేష్ డి. పటేల్ (దాజీ)తో సమావేశమవుతారు. అనంతరం విజయవాడలో జరిగే అధికారిక కార్యక్రమంలో పాల్గొంటారు.ఈరోజు ఉదయం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న తన నివాసం నుంచి బయలుదేరనున్న ముఖ్యమంత్రి, 11 గంటలకు కన్హా శాంతివనం చేరుకుంటారు. దాదాపు రెండు గంటల పాటు ఆయన ఆశ్రమంలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా వెల్‍నెస్, మెడిటేషన్, యోగా కేంద్రాలతో పాటు ట్రీ కన్జర్వేషన్ సెంటర్, రెయిన్ ఫారెస్ట్, బయోచార్ కేంద్రం, పుల్లెల గోపీచంద్ స్టేడియం, హార్ట్‌ఫుల్‌నెస్ ఇంటర్నేషనల్ స్కూల్ వంటివి సందర్శిస్తారు. సుస్థిర వ్యవసాయ క్షేత్రాన్ని కూడా ఆయన పరిశీలించనున్నారు.