|
|
by Suryaa Desk | Mon, Dec 15, 2025, 12:37 PM
తెలంగాణలో జరిగిన రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. తొలి విడత తరహాలోనే మలి విడతలోనూ అత్యధిక సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుని గ్రామీణ ప్రాంతాల్లో తన పట్టును నిరూపించుకుంది. ఆదివారం జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు సగానికి పైగా స్థానాల్లో విజయకేతనం ఎగురవేశారు.మొత్తం 3,911 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా, తాజా సమాచారం ప్రకారం కాంగ్రెస్ మద్దతుదారులు 2,200కు పైగా స్థానాలను గెలుచుకున్నారు. మరోవైపు, ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా గట్టి పోటీనిచ్చి 1,100కు పైగా స్థానాల్లో విజయం సాధించి రెండో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా ఎదగాలని భావిస్తున్న బీజేపీ సుమారు 250 స్థానాలకే పరిమితమైంది.