|
|
by Suryaa Desk | Sat, Nov 01, 2025, 04:58 PM
ఇంటర్నెట్ బ్రౌజింగ్ కోసం గూగుల్ క్రోమ్ వాడుతున్న వారికీ కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In), క్రోమ్ డెస్క్‌టాప్ వినియోగదారులకు ఓ హై-రిస్క్ హెచ్చరిక జారీ చేసింది. క్రోమ్ బ్రౌజర్ పాత వెర్షన్లలో కొన్ని తీవ్రమైన భద్రతా లోపాలను గుర్తించినట్లు, వీటి వల్ల యూజర్ల వ్యక్తిగత సమాచారం, ప్రైవసీ ప్రమాదంలో పడే అవకాశం ఉందని తెలిపింది.సైబర్ నేరాలు పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో ఈ లోపాలను ఆసరాగా చేసుకుని హ్యాకర్లు యూజర్ల అనుమతి లేకుండా వారి కంప్యూటర్ల నుంచి కీలక డేటాను దొంగిలించే ముప్పు ఉందని CERT-In తన నివేదికలో స్పష్టం చేసింది. ముఖ్యంగా విండోస్, మ్యాక్, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌లలో క్రోమ్ డెస్క్‌టాప్ బ్రౌజర్ వాడుతున్న వారు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ప్రమాదంలో ఉన్న వెర్షన్లు :
CERT-In ప్రకారం, కొన్ని నిర్దిష్ట పాత వెర్షన్లు వాడుతున్న వారికి ఈ ప్రమాదం ఎక్కువగా ఉంది.
* 142.0.7444.59 కంటే ముందున్న గూగుల్ క్రోమ్ లైనక్స్ వెర్షన్లు
* 142.0.7444.59/60 కంటే ముందున్న విండోస్ వెర్షన్లు
* 142.0.7444.60 కంటే ముందున్న మ్యాక్ వెర్షన్లు. ఈ వెర్షన్లను వాడే వినియోగదారులు తక్షణమే తమ బ్రౌజర్‌ను లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలని ఏజెన్సీ గట్టిగా సిఫార్సు చేస్తోంది.