|
|
by Suryaa Desk | Sat, Nov 01, 2025, 05:03 PM
భారత్‌లో వాయు కాలుష్యం పెను భూతంలా మారుతూ లక్షలాది మంది ప్రాణాలను బలిగొంటోంది. ప్రభుత్వం ఎంతగా కాదన్నా దేశంలో ఇది అత్యంత తీవ్రమైన ప్రజారోగ్య సమస్యగా కొనసాగుతోందని మరోసారి రుజువైంది. 2022లో ఒక్క ఏడాదిలోనే విషపూరిత గాలి కారణంగా 17 లక్షల మందికి పైగా భారతీయులు మరణించారని తాజా అధ్యయనం తేల్చింది. 2010తో పోలిస్తే ఈ మరణాల సంఖ్య ఏకంగా 38 శాతం అధికం కావడం ఆందోళన కలిగిస్తోంది.ప్రఖ్యాత "లాన్సెట్ కౌంట్‌డౌన్ ఆన్ హెల్త్ అండ్ క్లైమేట్ చేంజ్" నివేదిక ఈ చేదు నిజాలను వెలుగులోకి తెచ్చింది. 71 విద్యాసంస్థలు, ఐక్యరాజ్యసమితి ఏజెన్సీలకు చెందిన 128 మంది నిపుణులు ఈ నివేదికను రూపొందించారు. శిలాజ ఇంధనాలపై మితిమీరి ఆధారపడటం, వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో విఫలమవడం ప్రజల ఆరోగ్యంపై ఎలాంటి తీవ్ర ప్రభావం చూపుతోందో ఇది స్పష్టం చేసింది.