|
|
by Suryaa Desk | Sun, Nov 02, 2025, 04:55 PM
రక్షణ శాఖ పరిధిలోని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ(మెదక్) నియామక ప్రకటనను విడుదల చేసింది. సంస్థలోని జూనియర్ టెక్నీషియన్, డిప్లొమా టెక్నీషియన్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నెల 1 నుంచే దరఖాస్తు గడువు ప్రారంభం కాగా.. 21వ తేదీతో గడువు ముగుస్తుందని ప్రకటించింది. కాంట్రాక్ట్ బేసిస్ పై మొత్తం 34 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది.అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను ది డిప్యూటీ జనరల్ మేనేజర్ (హెచ్ఆర్), ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్, ఎద్దుమైలారం, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ– 502205 చిరునామాకు పంపించాలని సూచించింది. రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని పేర్కొంది. పూర్తి వివరాలను ddpdoo.gov.in వెబ్ సైట్ లో చూడాలని ప్రకటనలో తెలిపింది.