|
|
by Suryaa Desk | Tue, Nov 04, 2025, 02:41 PM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి *శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారికి* విజయం సాధించాలని శేరిలింగంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు *మరబోయిన రవి యాదవ్ గారు* ఎర్రగడ్డ డివిజన్ బూత్ నంబర్ 398, సుల్తాన్‌నగర్ కాలనీలో ప్రజలతో కలిసి ప్రచారం నిర్వహించారు.ఇంటింటికీ వెళ్లి పాదయాత్ర ద్వారా ప్రజలకు పాంప్లెట్‌లు పంపిణీ చేస్తూ, కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న బీఆర్‌ఎస్ పార్టీని మరోసారి విజయం వైపు నడిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని రవి యాదవ్ గారు పిలుపునిచ్చారు.*