జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పాత హౌసింగ్ బోర్డ్ కాలనీ సమీపంలోనున్న ఫాతిమా మజీద్ వద్ద గుర్తు తెలియని రైలు ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. ప్రమాదాన్ని గుర్తించిన కాలనీవాసులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు డెడ్ బాడీని ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున జరిగినట్లు పేర్కొన్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa