పాలమూరు యూనివర్సిటీ ఇన్ఛార్జి వైస్ ఛాన్సలర్ గా ఐఏఎస్ నదీం అహ్మద్ ను మంగళవారం ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత వీసీ లక్ష్మీకాంత్ రాథోడ్ పదవీకాలం నేటితో ముగిసింది. ఈ క్రమంలో వర్సిటీలో కార్యకలాపాలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఇన్ఛార్జీ వీసీగా నదీంను నియమిస్తూ సీఎస్ ఉత్తర్వులు ఇచ్చారు. కొత్త వీసీ నియామకం అయ్యే వరకు వీరే విధుల్లో ఉంటారు. ఇప్పటికే కొత్త వీసీల కోసం యూనివర్సిటీలో సెర్చ్ కమిటీ ఏర్పాటు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa