సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీఈవో మధుకర్ నాయక్ ను సోమవారం కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీగణేశ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఈవో మధుకర్ నాయక్ను శాలువాతో సన్మానించారు. అనంతరం కంటోన్మెంట్ అభివృద్ధి, పలు విషయాలపై చర్చించారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారానికి కలిసికట్టుగా కృషి చేయాలని శ్రీగణేశ్ సూచించారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa