జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. స్థానికులకు వివరాల ప్రకారం.. కళ్ళముందు ఆడుకుంటూ కనిపించిన ఓ బాలుడు విద్యుత్ షాక్తో అక్కడికక్కడే ప్రాణాలు విడిచిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన శ్రీనివాసులు, మద్దమ్మలకు ఇద్దరు కూతుర్లు, కుమారుడు వీరేశ్(7) ఉన్నారు. ఎద్దులు పోట్లాడుతూ స్తంభానికి తగలడంతో సర్వీస్ వైర్ కిందపడి ఆ బాలుడికి విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa