మరికల్ మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదిముభారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. ఆడపిల్లల పెళ్లిళ్లు తల్లితండ్రులకు భారం కాకూడదని ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని అన్నారు. డబ్బులను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa