ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షబ్బీర్ అలీ కాన్వాయ్‌లోని రెండు కార్లు ఢీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 04, 2024, 12:35 PM

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కాన్వాయ్‌లోని రెండు కార్లు ఢీకొన్న ఘటన పట్టణంలోని ఫారెస్ట్ ఆఫీస్ కార్యాలయం సమీపంలో బుధవారం చోటుచేసుకుంది.నిజామాబాద్ అర్బన్ జిల్లా ఇంచార్జిగా ఉన్న ఆయన పర్యటనలో భాగంగా ఇవాళ నిజామాబాద్ పట్టణానికి వచ్చారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా జిల్లా ఫారెస్ట్ కార్యాలయం ముందు ఆయన కాన్వాయ్‌లోని కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 3 కార్లు స్వల్పంగా దెబ్బతినడం మినహా ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa