హైదరాబాద్ నగర శివారులోని ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్‌ఆర్) పైనుంచి లారీ పల్టీలు కొడుతూ కింద పడిపోయింది. పెద్ద అంబర్‌పేట సమీపంలోని తారామతిపేట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఘట్‌కేసర్ నుంచి ఐరన్ లోడ్‌తో బెంగళూరు బయల్దేరిన లారీ.. అదుపుతప్పి పల్టీ కొడుతూ సర్వీస్ రోడ్డుపై పడింది. ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతిచెందగా.. క్లీనర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతడి పరిస్థితి విషమంగా ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa