ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 28, 2024, 03:32 PM

సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మండలం నిజాంపూర్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు క్లీనర్లు ప్రాణాలు కోల్పోయారు. ఆగి ఉన్న లారీని మరో లారీ వేగంగా ఢీ కొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది.ఈ సంఘటనలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ దవాఖానకు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిద్రమత్తు వల్లనే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa