రాజ్యాంగ విరుద్ధమైన ఎస్సీ వర్గీకరణ చేయడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ ఆరోపించారు.ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన మాలల మహాపాదయాత్ర శనివారం సాయంత్రం మానకొండూర్ చేరుకుంది.మానకొండూర్ మండల మాల మహానాడు అధ్యక్షుడు బొల్లం వెంకటస్వామి ఆధ్వర్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా పిల్లి సుధాకర్ మాట్లాడుతూ..రాజకీయ పార్టీలు దళితులను ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటున్నాయని వాపోయారు.ప్రభుత్వాలు రాజ్యాంగ విరుద్ధమైన ఎస్సీ వర్గీకరణ చేయడం కోసం అనేక కుట్రలు పన్నుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మాలల జనాభా తక్కువ ఉందని ఆశాస్త్రీయమైన లెక్కలు చూపిస్తూ రాజకీయ పార్టీలను, ప్రభుత్వాలను బ్లాక్ మెయిల్ చేస్తూ ఓ వర్గం పనికట్టుకొని తప్పుదోవ పట్టిస్తోందని సుధాకర్ విమర్శించారు.ఈ కార్యక్రమంలో మాల సంఘం మానకొండూర్ గ్రామ అధ్యక్షుడు వేల్పుల రాములు, జనరల్ సెక్రెటరీ ఉండండి ఆంజనేయులు,సభ్యులు బొల్లం రామస్వామి,ఉండింటి సామ్సన్,బొల్లం మల్లేశం,ఉండింటి అశోక్, యువకులు పాల్గొన్నారు.