కోర్టులో కేసుల పెండింగ్ సంఖ్యను తగ్గించాలని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే అన్నారు. కరీంనగర్ కోర్టు ఆవరణలో పోక్సో, ఫ్యామిలీ కోర్టు సహా 12కోర్టులు ఉండే జిల్లా కోర్టు సముదాయాల భవన నిర్మాణానికి ఆయన ఆదివారం శంకుస్థాపన చేశారు. దీంతో పాటు సీతారాంపూర్ రోడ్డులోని న్యాయాధికారుల నివాస గృహాల భవనాల నిర్మాణాలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శంకుస్థాపన చేశారు.