వికారాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.వెంకటరవణ అనంతగిరి గుట్ట, వికారాబాద్ నందు గల పాలేటివ్ కేర్ సెంటర్ ను ఎన్ సీడీ ప్రోగ్రాం అధికారిణి డా.నిరోష, జిల్లా ఎన్ సీడీ సమన్వయకర్తలు రేణు కుమార్, జయరాం లతో కలిసి సందర్షించినారు.
పాలేటివ్ కేర్ కేంద్రంలో అందించే బయటి రోగుల సేవలను (అవుట్ పేషెంట్ ), లోపల రోగుల సేవలను (ఇన్ పేషెంట్ ), ఫిజియోథెరపీ సేవలు, ఆలన వాహనం ద్వారా అందించే గృహ సందర్షనలను (హోమ్ విజిట్ ),వాటి వివరాలను వైద్యాధికారి డా.వాహాబ్, ఫిజియో తెరపిస్ట్ డా.సుప్రియ, స్టాఫ్ నర్సులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ఈ కేంద్రం ద్వారా క్యాన్సర్, పక్షవాతం, హృదయ సంబంధ వ్యాదులు గల రోగులకు సేవలు అందిస్తామని వివరించినారు. అనంతరం రిజిస్టర్లను, రికార్డులను, రిపోర్టులను పరిశీలించినారు. సేవలు పెంపొందించాలని, సేవలు ప్రతి యొక్క బాధితులకు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.