ద్విచక్ర వాహనంలో ఉంచిన నగదు చోరీకి గురైన ఘటన సోమవారం పట్టణంలో జరిగింది. సీఐ నరసింహులు తెలిపిన వివరాల ప్రకారం నిరంజన్ అనే వ్యక్తి విక్రయించిన పత్తిని సంబంధించిన రూ. 3 లక్షలు బ్యాంక్ ఖాతాలో జమయ్యాయి.
నగదు డ్రా చేసి బైక్ డిక్కిలో పెట్టుకొని బయలుదేరాడు. మధ్యలో మెడికల్ షాప్ లో మందులు కొనుగోలు చేసి, తిరిగి వాహనం వద్దకు రాగా అప్పటికే గుర్తుతెలియని వ్యక్తులు డిక్కీ పగలగొట్టి నగదు ఎత్తుకెళ్లారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa