సంకష్ట చతుర్థి సందర్భంగా సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రేజింతల్ లో కొలువైన శ్రీ సిద్ధి వినాయక ఆలయంలో బుధవారం విశేష అర్చనలను భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి మూలమూర్తికి అభిషేకాలు, అలంకరణ గావించి నైవేద్య నివేదన చేసి, కర్పూర హారతులతో మంగళ నీరాజనాలను సమర్పించారు. తొలి మొక్కుల దేవుడిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలి వచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa