చివ్వేంల మండలం తిమ్మాపురం గ్రామంలో గురువారం రాత్రి 7: 30 గంటలకు నారెడ్డిధనమ్మ అనే మహిళ ఇంట్లో ఉండగా గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి తన మెడలో ఉన్న 4తులాల పుస్తెల తాడును తెంపుకొని పారిపోయాడు.
ఆ సమయానికి ఊళ్లో కరెంట్ లేకపోవడంతో దుండగుడు అక్కడినుండి పరారయ్యాడు. మెడ నుండి తాడును బలంగా లాగడంతో ధనమ్మకు గాయాలయ్యాయి. వెంటనే 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు ధనమ్మ ఇంటికి చేరుకొని సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa