ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్లో బలిజ శేఖర్ కిరాణం కొట్టు డబ్బాలో సోమవారం ఉదయం 9:30 గంటల సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. దేవుని ఫొటోలకు అగర్ బత్తులు వెలిగించిన తర్వాత షట్టర్ మూసివేసి వెళ్లగా, మంటలు వ్యాపించాయి. సమీపంలో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ అంగూరి నవీన్ ధైర్యంగా షట్టర్ తెరిచి, నల్లాల నీటితో మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో సుమారు పదివేల విలువైన నిత్యావసర వస్తువులు కాలిపోయాయి. నష్టపోయిన వ్యాపారికి ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. మంటలను ఆర్పివేసిన కానిస్టేబుల్ నవీన్ను పలువురు అభినందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa