వాట్సాప్ మరో కొత్త ఫీచర్ ను తీసుకురానుంది. చాట్ పేజీలో మనకు అవసరమైన మెసేజ్‌లను ఈజీగా వెతకడానికి కొత్త సెర్చ్ ఆప్షన్ ను తీసుకురానుంది. ప్రస్తుతం టెక్ట్స్‌తో సెర్చ్ చేసినట్లుగా, ఇకపై డేట్ తో కూడా మెసేజ్ లను సెర్చ్ చేయొచ్చు. అంటే తేదీల వారిగా మెసేజ్‌లను యూజర్లు ఫిల్టర్ చేసి చూడొచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ ఐఓఎస్ బీటా యూజర్లకు అందుబాటులో ఉంది. త్వరలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది.