భారతీయ మైక్రోబ్లాగింగ్ సైట్ ‘కూ’ అకౌంట్‌ను ట్విట్టర్ తొలగించింది. కాగా ట్విట్టర్ వంటి సైట్లకు పోటీగా ‘కూ’ మైక్రోబ్లాగింగ్ సైట్‌ను రూపొందించిన విషయం తెలిసిందే. నిబంధనలు ఉల్లంఘించారన్న పేరుతో జర్నలిస్ట్‌ల అకౌంట్లపై వేటువేస్తున్న మస్క్ తాజాగా ‘కూ’ ఖాతాను కూడా సస్పెండ్ చేయడం గమనార్హం. దీనిపై ‘కూ’ సహ వ్యవస్థాపకుడు మయాంక్ బిదావత్కా #ElonIsDestroyingTwitter ట్యాగ్ వాడుతూ ట్వీట్ చేశారు. సమాచారాన్ని పోస్టు చేయడం నేరమేమీకాదని అన్నారు. జర్నలిస్టులు లింకులు పోస్ట్ చేస్తే తప్పేంటని నిలదీశారు.