ఏటా పలు రకాల మొబైల్ ఫోన్లలో సేవలను నిలిపివేస్తూ వస్తుంది ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్. ఈ ఏడాది కూడా డిసెంబర్ 31 నుంచి యాపిల్, సామ్‌సంగ్ సహా 49 ఫోన్లలో వాట్సాప్ పనిచేయదని సంస్థ వెల్లడించింది. అయితే ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే అవన్నీ ఔట్‌డేట్ అయిన చాలా పాత ఫోన్లు. పెద్దగా వినియోగంలో లేనివి. అందులో యాపిల్ ఐఫోన్ 5, 5సీ, లెనొవో ఏ820, సామ్‌సంగ్ గ్యాలక్సీ ఏస్ 2, కోర్, ఎస్2, ఎస్3 మినీ, ట్రెండ్ 2, ట్రెండ్ లైట్, ఎక్స్ కవర్ 2, సోనీ ఎక్స్‌పీరియా ఆర్క్ ఎస్, మిరో, నియో ఎల్ వంటి మోడల్స్ ఉన్నాయి.