కుంకుమ కింద పడితే అశుభంగా చాలా మంది భావిస్తారు. అది అపోహేనని, ఏదైనా పూజ కానీ, వ్రతం కానీ చేసినప్పుడు కుంకుమ భరిణ కింద పడడం మంచిదని పండితులు చెబుతున్నారు. అలా జరిగితే అది భూమాతకు బొట్టు పెట్టమని అర్థమట. ఆ సమయంలో భూమాతకు బొట్టు పెట్టి మిగతా కుంకుమను చెట్లలో వేయాలని సూచిస్తున్నారు. అతిథులను సాగనంపేటప్పుడు పసుపు, కుంకుమ ఇవ్వడం మంచిదంటున్నారు.