శరీరంలో విటమిన్ బీ12 లోపిస్తే అనేక సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి తగ్గడం సహా అనీమియాకు దారి తీస్తుంది. అలసట, తలనొప్పి వేధిస్తాయని చెబుతున్నారు. జీర్ణ వ్యవస్థపై ప్రభావం పడుతుందని అతిసారం, వికారం, మలబద్ధకం, ఉబ్బరం, గ్యాస్, ఆకలి లేకపోవడం, హఠాత్తుగా బరువు తగ్గడం వంటి రుగ్మతలు రావొచ్చంటున్నారు.