ఎండ వేడి తట్టుకోలేక చాలామంది ఏసీలకు అలవాటు పడుతుంటారు. అయితే ఏసీలో ఎక్కువగా ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. ఏసీలో ఎక్కువగా ఉంటే చర్మం పొడిబారిపోతుంది. ఏసీలో ఎక్కువ సేపు ఉండటం వల్ల కంట్లో ద్రవాలు తగ్గిపోతాయి. ఏసీ గదుల్లో ఎక్కువ సమయం ఉండడం వల్ల ముక్కు, గొంతు, కళ్లు, శ్వాస కోశ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ.