శరీరం అలసిపోయిన సందర్భంలో వేడి నీటితో స్నానం చేస్తే రిలాక్సేషన్ లభిస్తుంది. ఇదే కాకుండా ఇంకా చాలా ప్రయోజనాలున్నాయి. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. నిద్రవేళకు 90 నిమిషాల ముందు వేడి నీళ్లతో స్నానం చేస్తే మెదడు ఉత్తేజితం అవుతుంది. తద్వారా గాఢనిద్ర పడుతుంది. మీ చర్మాన్ని మృదువుగా చేయడంలో సాయపడుతుంది. అయితే నీరు ఎక్కువ వేడి ఉంటే చర్మం పొడిబారడం, దురద వంటివి వచ్చే ప్రమాదం ఉంది.