తాగే నీరు స్వచ్ఛమైనప్పుడు ఆరోగ్యం, అందం రెండూ బాగుంటాయి. స్కిన్ గ్లోయింగ్ ఉండాలంటే నార్మల్ వాటర్ కంటే కొన్ని డిటాక్స్ వాటర్ తాగడం మేలని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. బ్లాక్ బెర్రీస్‌లో మింట్ కలిపి వాటర్‌లో వేసుకుని రాత్రంతా నానపెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి. దోసకాయ నీటిని రోజూ తాగడం వల్ల ఎముకలు పుష్టిగా ఉంటాయి. ఈ దోసకాయ నీరు అంతర్గతంగా మెరుస్తున్న చర్మాన్ని అందిస్తుంది. నీటిలో నానబెట్టిన దోసకాయను చర్మంపై అప్లై చేయడం వలన మొటిమలను తగ్గిస్తుంది. పైనాపిల్ వాటర్ వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రోజ్‌మెరి, సోంపు వాటర్, స్ట్రాబెర్రీ వాటర్, దాల్చిన చెక్క వాటర్ ఆరోగ్యంతో పాటు అందానికి మంచింది.