చాలామందికి ఉన్నట్టుండి కళ్లు తిరిగినట్లు, మైకం కమ్మినట్లు కొద్ది క్షణాలు అనిపిస్తుంటుంది. కాసేపటి తర్వాత తిరిగి మామూలైపోతుంటుంది. చాలామంది దీన్ని అంతగా పట్టించుకోరు కానీ ఇది గుర్తించాల్సిన సమస్య. దీనికి అనేక కారణాలు ఉంటాయి. వర్కవుట్ చేయడం, తగిన పోషకాహారం తినకపోవడం, బ్లడ్ ప్రెషర్ తగ్గడం, తగినంత నీరు లేకపోవడం, శరీరం వేడెక్కడం లాంటి ఇతర కారణాల వల్ల మైకం కమ్మడం జరుగుతుంటుంది.