వేసవిలో లూజ్ మోషన్స్ వేధిస్తుంటే చిన్న చిట్కాలతో తగ్గించుకోవచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. పెరుగు, మజ్జిగ తీసుకోవాలి. అల్లం టీలో కొంచెం తేనె కలిపి తాగితే జీర్ణ వ్యవస్థ మెరుగై సమస్య పరిష్కారమవుతుంది. నీళ్లలో కొంచెం నిమ్మరసం వేసి కలిపి తాగితే మోషన్స్ నుంచి ఉపశమనం పొందొచ్చు. అలాగే, జీలకర్ర నీళ్లు, పెరుగుతో మెంతులు కలిపి తీసుకున్నా మోషన్స్ కంట్రోల్ అవుతాయని పేర్కొంటున్నారు.