ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ ఫార్ట్ పుటర్ తజిందర్ పాల్‌తూర్ వరుసగా రెండోసారి స్వర్ణ పతకాన్ని గెలిచాడు. 20.33 మీటర్ల దూరానికి గుండును విసిరి అగ్రస్థానంలో నిలిచాడు. అలాగే మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో పారుల్ చౌదరి 9 నిమిషాలా 38 సెకన్లలో లక్ష్యాన్ని చేరి పసిడిని కైవసం చేసుకుంది. దాంతో ఈ చాంపియన్‌షిప్‌లో ఇప్పటివరకు భారత్‌కు 5 స్వర్ణాలు, ఒక రజతం, 3 కాంస్యాలు వచ్చాయి.