ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగనన్న కాలనీల్లో పూర్తి స్థాయి విచారణ చేపట్టాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 18, 2024, 11:23 PM

 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయం  కొనసాగుతోంది. అయితే సభలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సీరియస్ కామెంట్స్ చేశారు. జగనన్న కాలనీల్లో పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని కోరారు. అధికారుల నివేదికలకు వాస్తవ పరిస్థితులకు చాలా తేడా ఉందని అన్నారు. తప్పుడు నివేదికలు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ఆదేశించారు. ఒక అధికారిపై చర్యలు చేపడితే మిగిలిన అధికారులు ఇలా చేయరని.. అధికారులు ఇలాంటి పద్ధతులు వెంటనే మానుకోవాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com