ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. అయితే శాసన మండలిలో మహిళల అత్యాచారాలపై వాడివేడి చర్చ జరిగింది. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల మధ్య వాగ్వాదం మొదలైంది. ఈ విషయంపై హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ.. ఏపీలో జగన్ ప్రభుత్వం కంటే ఈ ఐదు నెలల్ కూటమి ప్రభుత్వంలో క్రైమ్ రేటు చాలా తగ్గిందని మంత్రి అనిత స్పష్టం చేశారు.మహిళలపై దాడులు, హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ప్రశ్నించారు. దిశ చట్టం తీసుకొస్తారా, దిశ యాప్ కొనసాగిస్తారా లేదా అని వైసీపీ ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి ప్రశ్నించారు. సభ్యుల ప్రశ్నలకు మంత్రి అనిత సమాధానం ఇస్తూ వైసీపీ ప్రభుత్వ పాలనలో చాలా లోపాలున్నాయని మంత్రి అనిత తెలిపారు. దిశ చట్టం లేదు. నిర్భయ చట్టం ఉంది. నిర్భయ కింద వైసీపీ ప్రభుత్వంలో కేసులు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చిన అమరావతిలో ఫోరెన్సిక్ ల్యాబ్ ఎందుకు నిర్మించలేదని వైసీపీ సభ్యులు నిలదీశారు. గంజాయి వినియోగం పెరగడంతో రాష్ట్రంలో నేరాలు పెరిగాయని మంత్రి అనిత వివరించారు.