ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో భారతదేశం గణనీయ పురోగతి సాధిస్తుందని జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అలాగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ భాగస్వామ్య కూటమైన మహాయుతి ప్రభుత్వం గొప్ప ప్రగతిని సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థకు బలమైన స్తంభంగా ఎదగాలని తాము ఆశిస్తున్నామన్నారు. మహారాష్ట్రలోని అభ్యర్థులందరికీ పిఠాపురం శ్రీ పాద శ్రీ వల్లభ స్వామితోపాటు మా తుల్జా భవాని ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తున్నామని చెప్పారు. మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ.. పిఠాపురంలోని శ్రీపాద శ్రీ వల్లభ దేవాలయంలో జనసేన, బీజేపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.