ఆసియా కప్ - 2023 షెడ్యూల్ కోసం గత ఏడెనిమిది నెలలుగా భారత్, పాక్ క్రికెట్ బోర్డుల మధ్య చర్చలు, వాదనలు, అలలు, అవమానాలు, బెదిరింపులు, బహిష్కరణ హెచ్చరికల మధ్య సాగుతున్న ఆసియాకప్‌లో మరో కీలక ఘట్టం నేడు వెల్లడికానుంది. హైబ్రిడ్ మోడల్‌లో జరగనున్న ఈ టోర్నీలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడు జాకా అష్రఫ్ ఈరోజు సాయంత్రం 7.45 గంటలకు ఆసియా కప్ - 2023 షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 17 వరకు పాకిస్థాన్, శ్రీలంక దేశాల్లో జరగనున్న ఈ మెగా టోర్నీకి కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది. పాకిస్తాన్‌లో నాలుగు, శ్రీలంకలో 9 మ్యాచ్‌లు ఆడబోయే ఈ టోర్నీలో.. స్వదేశంలో బాబర్ ఆజమ్ సేన, తమ తొలి మ్యాచ్‌ను నేపాల్‌తో ఆడనుంది.