డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత వెస్టిండీస్‌కు వచ్చిన భారత క్రికెటర్లు ఆ పనిలో దాదాపు విజయం సాధించారు. వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు కూడా భారత జట్టు ఆధిపత్యమే కనిపించింది. రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 84 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. తొలి సెషన్‌లో వికెట్ నష్టపోకుండా 121 పరుగులు చేసిన టీమిండియా రెండో సెషన్‌లో నాలుగు వికెట్లు కోల్పోయింది. మూడో సెషన్‌లో రవీంద్ర జడేజా, విరాట్ కోహ్లీ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో వెస్టిండీస్‌కు మరో వికెట్ పడకుండానే ఆట ముగిసింది. దీంతో తొలి రోజు ఆటలో భారత జట్టు ఓవరాల్ ఆధిక్యం కొనసాగింది. విరాట్ కోహ్లీ 161 బంతుల్లో 8 ఫోర్లతో 87 పరుగులు చేయగా, రవీంద్ర జడేజా 84 బంతుల్లో 4 ఫోర్లతో 36 పరుగులు చేశాడు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 106 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.