టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మపై వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రపంచకప్ జట్టులో తిలక్ వర్మను చేర్చుకోవాలని సూచించాడు. అతని చేరికతో టీమ్ ఇండియా మిడిల్ ఆర్డర్ మరింత పటిష్టం కానుందని అన్నాడు. తిలక్ వర్మను ఇబ్బంది పెట్టే బౌలర్ ఏ టాప్ టీమ్‌లోనూ లేడని, అతను ఎక్స్ ఫ్యాక్టర్ అవుతాడని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.
వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన తిలక్ వర్మ.. (39, 51, 49 నాటౌట్) వరుసగా మూడు మ్యాచ్‌ల్లో రాణించాడు. 69.50 యావరేజ్ 139 స్ట్రైక్‌రేట్‌తో 139 పరుగులు చేశాడు. సహచర యువ ఆటగాళ్లు, పలువు స్టార్ ప్లేయర్లు వెస్టిండీస్ బౌలింగ్‌లో ఇబ్బంది పడుతుంటే తిలక్ వర్మ మాత్రం అలవోకగా షాట్లు కొడుతూ పరుగులు రాబడుతున్నాడు.