భారత్, న్యూజిలాండ్ మధ్య ఈనెల 15న తొలి సెమీస్ జరుగనుంది. ఈ మ్యాచ్‌కి వేదికగా నిలిచే ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇప్పటివరకూ భారీ స్కోర్లు నమోదయ్యాయి. ఈ క్రమంలో మొదట బ్యాటింగ్ చేసే జట్టుకే ఎక్కువ విజయావకాశాలుంటాయి. మొదట బ్యాటింగ్‌లో భారీ స్కోరు చేయొచ్చు. ఈ ఎర్రమట్టి పిచ్ ఆట సాగుతున్నా కొద్దీ పేసర్లు, స్పిన్నర్లకూ అనుకూలించే అవకాశం ఉంది. దీంతో ఛేదనలో పరిస్థితులు బౌలింగ్‌కు అనువుగా మారే ఆస్కారముంది.