ప్రపంచకప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడేందుకు సర్వం సిద్ధమైంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. భారత్, న్యూజిలాండ్ తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో తలపడనున్నాయని తెలిసినప్పటి నుంచి అభిమానులంతా 2019 ప్రపంచకప్ సెమీస్ గురించి మాట్లాడుకుంటున్నారు.
అయితే అంతకుముందు కూడా కివీస్‌పై భారత్ కేవలం ఒక్కసారే గెలిచిందనే సంగతి మర్చిపోతున్నారు. ఈ వరల్డ్ కప్‌లో ధర్మశాల వేదికగా ఈ రెండు జట్లు తలపడిన మ్యాచులో భారత్ గెలిచింది. అంతకుముందు వన్డే వరల్డ్ కప్ చరిత్రలో కివీస్‌ను భారత్ కేవలం రెండుసార్లే ఓడించింది. ఒకసారి 1987లో ఓడిస్తే, ఆ తర్వాత మళ్లీ 2003లో న్యూజిల్యాండ్‌పై భారత్ గెలిచింది.
మొత్తంమీద ఈ రెండు జట్లు ICC వైట్ బాల్ టోర్నీల్లో 13 సార్లు తలపడ్డాయి. ఇందులో 9 సార్లు భారత్ ఓటమి చవిచూసింది. 2021 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో కివీస్ చేతిలో భారత్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. నాకౌట్‌లో భారత్ ఒక్కసారి కూడా కివీస్‌ను ఓడించలేకపోయింది. మరి రోహిత్ సేన ఆ చరిత్రను తిరగరాస్తుందేమో చూడాలి.